సావిత్రీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: మొదటి ఉపాధ్యాయురాలిగా పని చేసిన సావిత్రీబాయి పూలేను మహిళా ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. సావిత్రీబాయి పూలే జయంతిని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఉపాధ్యాయుల దినోత్సవానికి అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి విద్యాశాఖ అధికారి దీపక్ తివారీ, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగతో కలిసి హాజరయ్యారు. జిల్లా గిరిజన సంక్షేమాధికారి ణి రమాదేవి, విద్యాశాఖ అధికారులతో కలిసి సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 50శాతానికి పైగా మహిళా ఉపాధ్యాయులు పని చేస్తున్నారని తెలిపా రు. మహిళా ఉపాధ్యాయులు సావిత్రీబాయిని ఆదర్శంగా తీసుకుని బాలికలు విద్య, క్రీడా రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి కృషి చేసిన 10మంది మహిళా ఉపాధ్యాయులను శాలు వాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఏఎంసీ డైరెక్టర్ వైరాగడె మారుతీపటేల్, బీసీ సంఘం ప్రతినిధి ఆవిడపు ప్రణయ్‌కుమార్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


