సవరణ పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించా రు. శనివారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అ ధికారులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ.. ఓటరు జాబితాలో కేటగిరీలుగా మ్యాపింగ్, డెస్క్ పూర్తి చేసి బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు, సహాయ ఎన్నికల అధికారులకు రోజువారీ గా లక్ష్యాన్ని నిర్దేశించాలని సూచించారు. బూత్ స్థా యి ఏజెంట్లు, రాజకీయ పార్టీల సహకారం తీసుకు ని సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపట్టాలని తెలి పారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ.. జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ప్ర త్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఓటరు జాబితాను పోలింగ్ కేంద్రాల వారీ గా ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లతో ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించనున్నట్లు తెలిపారు. ఓటరు జాబితాలో ఒకే రకమైన నమోదులను గుర్తించి, మ రణించిన, గ్రామం వదిలి వెళ్లిపోయిన వారిని గు ర్తించి ఫారం–8 ద్వారా నోటీసులు జారీ చేసి వివరా లు జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం, రా జకీయ పార్టీల సహకారంతో కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బూత్ స్థాయి అధికారులకు గు ర్తింపు కార్డులు ఇస్తామని, గడువులోపు కార్యక్రమాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపా రు. కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్దాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావ్, ఎన్నికల విభాగం అధికారులున్నారు.


