ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
ఆసిఫాబాద్‌అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని కలెక్టర్ వెంకటేశ్ దోత్రె పేర్కొన్నా రు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. స బ్ జైలు, పోలీస్‌స్టేషన్, కేబీ చౌక్, బస్టాండ్ మీదుగా పోలీస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాహనదా రులు హెల్మెట్ ధరించాలని, సీటు బెల్ట్ విని యోగించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూ చించారు. రోడ్డు భద్రతపై పోలీస్, రవాణా, రెవె న్యూ తదితర శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రజలంతా రోడ్డు భద్ర త నియమాలు పాటించాలని సూచించారు. మ ద్యం సేవించి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల ని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ప్రజల భద్రత, రక్షణ ప్రధాన ధ్యేయంగా పోలీస్‌శాఖ పని చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ వాహిదొద్దీన్, అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్ రాజమల్లు, సీఐ బాలాజీ వరప్రసాద్, వాంకిడి సీఐ సత్యనారాయణ, కాగజ్‌నగర్ టౌన్ సీఐ ప్రేంకుమార్, ఆర్‌ఐలు అంజన్న, విద్యాసాగర్, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, ఇతర శాఖల అధికారులు, స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బంది, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.


