గుడుంబా నిర్మూలనపై అవగాహన
దహెగాం: మండల కేంద్రంలోని యువకులు, ఎకై ్స జ్ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం గుడుంబా నిర్మూలనపై అవగాహన కల్పించారు. యువకులు మాట్లాడుతూ మండల కేంద్రంలో విచ్చలవిడిగా గుడుంబా విక్రయిస్తుండటంతో బానిసలుగా మారిన వారు ఇళ్లలోని వస్తువులు అమ్ముకుని తాగుతున్నారని తెలిపారు. గుడుంబాను అరికట్టాలని కోరారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ రవి మాట్లాడుతూ గతేడాది మండలంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టామన్నారు. ఇప్పటివరకు 520 లీటర్ల నాటుసారా, 150 కిలోల బెల్లం, 9 వాహనాలు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వెయ్యి లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 76 కేసులు నమోదు చేశామన్నారు. 80 మంది నిందితులను అరెస్టు చేయగా, 56 మందిని తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశామని వెల్లడించారు. నాటుసారా తయారు చేసినా, విక్రయించినా సమాచారం అందించాలని కోరారు.


