కాగజ్‌నగర్‌లో నీటి గోస
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలను చెల్లించకపోవడంతో సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. 11 రోజులుగా నిరసనలు తెలుపుతున్నా అధికారులు స్పందించకపోవడంతో అత్యవసర సేవల కార్మికులు సైతం విధులు బహిష్కరించారు. దీంతో పట్టణంలో తాగునీటి సరఫ రాకు అంతరాయం ఏర్పడింది. పట్టణంలో 30 వా ర్డులు ఉండగా, 70 వేలకు పైగా జనాభా ఉంది. ప ట్టణంలోని ఐదు వాటర్ ట్యాంక్‌ల ద్వారా వార్డులకు రోజు విడిచి రోజు తాగునీటిని సరఫరా చే స్తారు. కానీ ప్రస్తుతం నీటి సరఫరా నిలిచిపోయింది. మున్సిపల్‌లో జనరల్ ఫండ్ నిధులు లేమితో కా ర్మికులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
ఎస్పీఎం నల్లాలే దిక్కు
ఎస్పీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగునీటి రెండు నల్లాలే ప్రస్తుతం పట్టణ ప్రజలకు దిక్కుగా మారాయి. పట్టణంలోని మున్సిపల్ నీరు రాకుంటే ప్రజలు ఇక్కడి నుంచే తీసుకెళ్తారు. నౌగాంబస్తీ, టీచర్స్ కాలనీ, బాలాజీనగర్, శ్రీరాంనగర్, ద్వారకానగర్, శ్రీకృష్ణనగర్, కౌసర్ నగర్ కాలనీవాసులు ఈ నల్లా వద్దకు వస్తుంటారు. ప్రస్తుతం వాటర్ క్యాన్లలో నింపుకొని నీటిని తీసుకెళ్తున్నారు. అలాగే పట్టణంలోని సంఘం బస్తీ ఏరియాలోని ఎస్పీఎం చార్ నల్ వద్ద నుంచి అశోక్ కాలనీ, నిజాముద్దీన్ కాలనీ, రైల్వే లైన్, తదితర కాలనీల ప్రజలు నీటిని తీసుకెళ్తున్నారు.


