ముసాయిదా ఓటరు జాబితా విడుదల
కాగజ్‌నగర్‌టౌన్: మున్సిపాలిటీలకు వచ్చే నెలలోగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. గురువారం కాగజ్‌నగర్ మున్సిపల్ పరిధిలోని 30 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను విడుదల చేశారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డుపై అంటించారు. 30 వార్డుల్లో 51,205 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 25,004, మహిళలు 26,193 మంది, ఇతరులు ఎనిమిది మంది ఉన్నా రు. గత ఎన్నికల సమయంలో బల్దియాలో 44,946 మంది ఓటర్లు ఉండగా.. ఈసారి 6,295 మంది పె రిగారు. కాగా, నూతన మున్సిపాలిటీ ఆసిఫా బాద్‌లో ముసాయిదా ఓటరు జాబితా విడుదల కోసం అధికారులు శ్రమిస్తున్నారు. శుక్రవారం జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నెల 5న అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. కౌన్సిలర్ పదవిని ఆశిస్తున్న వారు పార్టీల నాయకులు, ఓటర్లను ఇప్పుడే కలుస్తున్నారు. యువ ఓటర్లతోపాటు మహిళలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నమయ్యారు.


