● గణనీయంగా తగ్గిన మిరప సాగు విస్తీర్ణం ● స్థానికంగా అమ్
చింతలమానెపల్లి మండలం రణవెల్లికి చెందిన జాటోత్ సోమేశ్‌కు ఐదెకరాల సొంత భూమి ఉంది. గతేడాది మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప సాగు చేశాడు. మొత్తం 180 క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది. మహారాష్ట్ర మార్కెట్‌కు తరలించగా, క్వింటాల్‌కు రూ.11,000 ధర పలికింది. రవాణా చార్జీలు పోగా రూ.9,500 మిగిలాయి. పెట్టుబడి, కూలీల ఖర్చులు తీసివేస్తే నష్టమే మిగిలింది. మొత్తం రూ.30లక్షలు ఖర్చు చేస్తే రూ.22లక్షల ఆదాయం వచ్చింది. గతేడాది నష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఆరు ఎకరాల్లోనే మిరప సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం గుండు పూత వచ్చి కాపు తగ్గింది. దిగుబడి రాకపోతే మిరప సాగు వదిలేయాల్సిందేనని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.. ఈ విధంగా జిల్లాలో చాలా మంది రైతులు ఈ ఏడాది మిరప సాగుకు దూరంగా ఉన్నారు.


