ఏఎంసీ చైర్‌పర్సన్‌గా ఇరుకుల మంగ
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ నూతన చైర్‌పర్సన్‌గా ఇరుకుల మంగ నియామకమయ్యారు. వైస్ చైర్మన్‌గా గాజుల రవీందర్, 16 మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేర కు పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం నూతన చైర్‌పర్సన్‌గా మంగ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందన్నారు. ఏళ్లుగా సామన్య కార్యకర్తగా పార్టీ బలోపేతం కృషి చేసిన తనను రాష్ట్ర నాయకత్వం గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు మహాత్మాగాంధీ, అంబేడ్కర్, కుమురంభీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వైరాగడె మారుతిపటేల్, గాజుల జక్కన్న, నాయకులు ఎండీ నిజాం, ఆకుల శ్రీనివాస్‌గౌడ్, సుదర్శన్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, విజయ్, వాసుదేవ్, బాలేష్, శ్రీకాంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


