శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: దహెగాం మండలంలోని గెర్రె గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ తలండి శ్రావ ణి కుటుంబానికి న్యాయం జరిగేదాకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రజాసంఘాల నాయకులు హె చ్చరించారు. శ్రావణి మృతికి కారణమైన వారిని కఠి నంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కు టుంబానికి న్యాయం జరిగేదాకా చేపట్టనున్న ఉద్య మ కార్యాచరణపై ఆదివారం జిల్లా కేంద్రంలో ప్ర జాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుల దురహంకార హత్య జరిగి 15రోజులైనా కలెక్టర్, ఎస్పీ ఆ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి భరోసా కల్పించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 4న కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత, 10న కలెక్టరేట్ ముట్టడి నిర్వహించనున్నట్లు తెలిపా రు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, నాయకులు ఆత్మకూరి చిరంజీవి, జయరాం, నరసింగ్‌రావ్, కార్తిక్, రాజేందర్, కృష్ణమాచారి, రవీందర్, శంకర్, టీకానంద్, నిఖిల్, కోటేశ్వర్, రాజ్‌కుమార్, పద్మ, మారుతి తదితరులు పాల్గొన్నారు.


