మహాసభలను విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఈ నెల 10నుంచి 13వరకు వరంగల్‌లో నిర్వహించనున్న పీడీఎస్ యూ 23వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మహాసభ ప్రచార పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరి ష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వి ఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్ర వ్యా ప్తంగా 2,800 కోట్ల మంది విద్యార్థుల స్కాల ర్ షిప్ నిధులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపా రు. మహాసభకు సంఘం నాయకులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. నాయకులు సమీర్, సుమంత్, సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


