దేశ హితమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం
కౌటాల: దేశ హితం కోసం ఆర్‌ఎస్‌ఎస్ ఉ ద్భవించిందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉ త్సవాల్లో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కౌటాల ఖండ ఆధ్వర్యంలో ఆదివా రం మండల కేంద్రంలోని భారతీ విద్యామందిర్ పాఠశాలలో పథ సంచలన్ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా తలో డి గ్రామం నుంచి కౌటాల గ్రామపంచాయ తీ కార్యాలయం వరకు ఎమ్మెల్యే, ఆర్‌ఎస్ ఎస్ స్వయం సేవకులు ర్యాలీ తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హిందూ సమాజంలో మార్పు కోసం పంచ పరివర్తనే లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్ పని చేస్తోందని తెలి పారు. ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు ప్రభీర్‌కుమార్ మండల్, ఎల్ములే దత్తు, చిప్ప మల్ల య్య, ఉప్పుల వెంకటేశ్, దాసరి వినోద్‌గౌడ్, సాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు.


