
జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు విద్యార్థి
కాసిపేట: మండలంలోని సోమగూడెంకు చెందిన పి.మణిదీప్ జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు డీఐఈవో అంజయ్య, ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ బాబురావు తెలిపారు. ఈ నెల 25, 26, 27వ తేదీల్లో జనగాంలో జరిగిన 69వ రాష్ట్రస్థాయి అండర్–19 ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొని ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని పేర్కొన్నారు. మందమర్రి మోడల్ స్కూల్ సెకండియర్ విద్యార్థి మణిదీప్ అక్టోబర్ 2నుంచి 12వరకు శ్రీనగర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. విద్యార్థిని డీఐఈవో, ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ, ఒలింపిక్ అసోసియేషన్ ఫుట్‌బాల్ సెక్రెటరీ పిన్నింటి రఘునాథరెడ్డి, కోచ్ బాదే శేఖర్ అభినందించారు.