
‘సద్దుల’ సంబురం
ఆసిఫాబాద్ పట్టణంలోని బాపూనగర్‌లో..
వాసవి కన్యకాపరమేశ్వరీ ఆలయంలో బతుకమ్మలతో మహిళలు
కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం మైదానంలో సంబురాలు
ఆసిఫాబాద్‌అర్బన్/కాగజ్‌నగర్‌టౌన్/రెబ్బెన: జిల్లావ్యాప్తంగా సోమవారం సద్దుల సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన ఆడపడుచులు ఆడిపాడారు. గౌరమ్మలకు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఆసిఫాబాద్ పట్టణంలోని వివిధ కాలనీల్లో మహిళలు అర్ధరాత్రి వరకు ఆడిపాడి బతుకమ్మలను స్థానిక పెద్దవాగులో నిమజ్జనం చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడామైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సంబురాలను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేపట్టారు. రెబ్బెన మండలం గోలేటిటౌన్‌షిప్‌లో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో పాటు ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి బతుకమ్మలు నెత్తిన ఎత్తుకుని ఉత్సాహపరిచారు.
గోలేటిలో బతుకమ్మ ఎత్తుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పక్కన జీఎం విజయ భాస్కర్‌రెడ్డి
బజార్‌వాడి హనుమాన్ ఆలయం వద్ద..
కాగజ్‌నగర్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

‘సద్దుల’ సంబురం

‘సద్దుల’ సంబురం

‘సద్దుల’ సంబురం

‘సద్దుల’ సంబురం