
రేషన్ డీలర్లకు కమీషన్ చెల్లించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆరు నెలల పెండింగ్ కమీషన్ విడుదల చేయాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం రేషన్ డీలర్లు వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కేశవ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న చాలీచాలని కమీషన్‌తో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో డీలర్లకు ప్రతినెలా రూ.5వేల గౌరవ వేతనం చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, రెండేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. హమాలీల చార్జీలు ప్రభుత్వమే భరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శేషగిరిరావు, పురుషోత్తం, ఆత్మారావు, శంకరయ్య, శ్రీనివాస్‌గౌడ్, గోపాల్, నారాయణ, విలాస్ తదితరులు పాల్గొన్నారు.