
ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో ముఖ గుర్తింపు హాజరు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ అబిద్ అలీ అన్నారు. కెరమెరి, ఝరిలోని ప్రభుత్వ పాఠశాలలను గురువారం సందర్శించారు. ఉపాధ్యాయులు, నాన్‌టీచింగ్ స్టాఫ్ సిబ్బంది ఎంతమంది రిజిస్ట్రేషన్ పూర్తిచేశారో అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్ కూడా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆడే ప్రకాశ్, కాంప్లెక్స్ హెచ్‌ఎం చంద్రశేఖర్, భరత్‌కుమార్ పాల్గొన్నారు.