ఆసిఫాబాద్‌రూరల్: నిరక్షరాస్యులను అక్షరా స్యులుగా తీర్చిదిద్దుదామని విద్యాశాఖ కోఆ ర్డినేటర్ మధుకర్ అన్నారు. జిల్లా కేంద్రంలో ని తెలంగాణ మోడల్ స్కూల్‌లో నవ భారత్ సాక్షరతా కార్యక్రమంలో భాగంగా గురువా రం జిల్లాలోని అన్ని మండలాల రిసోర్స్‌పర్సన్లకు ఉల్లాస్‌పై జిల్లాస్థాయి శిక్షణ నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లు పైబడిన వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలో 22వేల మందిని అక్షరాస్యత లేనివారిని గుర్తించామన్నా రు. పాఠశాలలు, గ్రామ సభలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో వీరికి బోధన కొనసాగుతుందన్నా రు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహేశ్వర్, రి సోర్స్‌పర్సన్ తిరుపతయ్య, శ్యాంసుందర్, మోహన్, సామలశ్రీ పాల్గొన్నారు.