
గోండి, కొలామి భాష పరిరక్షణలో..
ఆదిలాబాద్ రూరల్: మావల మండలం వా ఘాపూర్ గ్రామానికి చెందిన గిరిజన ఉపాధ్యాయుడు తొడసం కై లాస్ గోండి, కొలామి భాషల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి రోబోటిక్ టెక్నాలజీ కంప్యూటర్ ద్వారా యాంకర్‌ను తయారు చేసి గోండి భాషలో వార్తలు చదివిస్తున్నారు. గోండి, కొలామి, తెలుగు, హిందీ, ఆంగ్లం, లంబా డా భాషల్లో వందలాది పాటలు రాసి ఏఐ లో పొందుపర్చారు. మహాభారత గ్రంథాన్ని తెలుగు లిపితో గోండి భాషలో అనువదించారు. 18 పర్వాలు నాలుగు నెలలపాటు అనువదించి వంద పుస్తకాలు ప్రచురితం చేశారు. మన్‌కీబాత్‌లో పీఎం మోదీ కై లాస్‌ను ప్రశంసించారు. అప్పటి కలెక్టర్లు దివ్యదేవరాజన్, దేవసేన, ప్రస్తుత కలెక్టర్ రాజర్షిషా కై లాస్‌ను అభినందించారు.