
పాము కాటుకు యువకుడి మృతి
దహెగాం: పాము కా టుకు గురైన యువకు డు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో ని పంబాపూర్ గ్రా మంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పంబాపూర్ గ్రామానికి చెందిన కంబాల మహేశ్ (22) ఈనెల 2న ఇంట్లో ఉండగా లగ్గాం గ్రామానికి చెందిన బాబా అనే వ్యక్తి ఫోన్ చేసి బాత్రూమ్‌లో పాము ఉంది కొట్టడానికి రావాలని పిలిచాడు. దీంతో మహేశ్ వెంటనే బాబా ఇంటికి వెళ్లి బాత్రూమ్ డోర్ తీస్తున్న క్రమంలో పాము కాటు వేసింది. వెంటనే మ హేశ్ కుటుంబీకులకు విషయం తెలుపగా ద హెగాం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లికి తీసుకువెళ్లారు. అక్కడి నుండి మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహేశ్ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి పెదనాన్న పోశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.