
ప్లాస్టిక్ నివారణకు సహకరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ దుబ్బేట రాజు అన్నారు. ప్లాస్టిక్ నివారణ, వినియోగంతో కలిగే నష్టాలపై గురువా రం జిల్లా కేంద్రంలోని పలు దుకాణాలు, హోటళ్ల యజమానులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ వ్యాపార సముదాయాల్లో ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే జప్తు చేయడంతోపాటు జరిమానా విధిస్తామన్నా రు. వర్షాకాలం నేపథ్యంలో హోటళ్లలో ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టిఫిన్ సెంటర్లలో తాజా నూనె వినియోగించాలన్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది శ్రీకాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.