ఆహ్లాదం.. ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

ఆహ్లాదం.. ఆరోగ్యం

Aug 8 2025 7:55 AM | Updated on Aug 8 2025 7:55 AM

ఆహ్లా

ఆహ్లాదం.. ఆరోగ్యం

● జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో చిల్డ్రన్స్‌ పార్కుల ఏర్పాటు ● వాకింగ్‌ ట్రాక్‌లు, ఆట వస్తువులతో అభివృద్ధి ● ఉదయం, సాయంత్రం చిన్నారులు, పెద్దలతో సందడి వాతావరణం ● సద్వినియోగం చేసుకుంటున్న పట్టణవాసులు

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌టౌన్‌: జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చిల్డ్ర న్స్‌పార్కులు ఆహ్లాదం పంచుతున్నాయి. ఉరుకులు, పరుగుల జీవితంలో ఉదయం, సాయంత్రం పచ్చని గడ్డి మైదానాల్లో పట్టణ ప్రజలు సేద తీరుతున్నారు. పచ్చదనం కోసం వివిధ రకాల మొక్కలు నాటగా.. పిల్లలకు ఆహ్లాదాన్ని ఇచ్చేందుకు ఆట పరికరాలు ఏర్పాటు చేశారు. ఉదయం వాకర్స్‌ వ్యాయమం, యెగా కోసం వినియోగిస్తుండగా, సాయంత్రం పార్కులో కుటుంబ సమేతంగా గడుపుతున్నారు. సందర్శకుల రాకతో వీకెండ్స్‌లో మరింత సందడి వాతావరణం కనిపిస్తోంది.

ఫొటో షూట్లకు కేరాఫ్‌గా..

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో చిల్డ్రన్స్‌ పార్కులు పట్టణవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పట్టణంలోని సర్‌సిల్క్‌ కాలనీ, కాపువాడ, మార్కెట్‌ ఏరియాలోని గాంధీ చౌక్‌, ఎల్లాగౌడ్‌తోట సమీపంలోని పట్టణ పార్కులు ఉన్నాయి. పచ్చటి వాతావరణంతో కూర్చోవడానికి బల్లలు, పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణం ఉండడంతో వాకింగ్‌ కోసం వినియోగించుకుంటున్నారు. పిల్లలు ఆటలు ఆడుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. పట్టణంలో పార్కులు పచ్చని చెట్లతో అడవులను తలపించే విధంగా ఉన్నాయి. దీంతో వివిధ శుభకార్యాలకు ఫొటోషూట్లు నిర్వహించేందుకు అడ్డాలుగా ఫొటోగ్రాఫర్లు వినియోగించుకుంటున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లలేని వారికి ఇవి వరంలా మారాయి. తక్కువ ఖర్చుతో ఉచితంగా మంచి లొకేషన్లు ఉండడంతో నిత్యం సందడిగా కనిపిస్తున్నాయి.

వాకింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యం

నేను ఆసిఫాబాద్‌లోని చిల్డ్ర న్స్‌ పార్కులో రెగ్యులర్‌గా వాకింగ్‌తోపాటు యోగా చే స్తా. దీంతో రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాను. ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

– శ్రీనివాస్‌, ఉపాధ్యాయుడు

రూ.2.09 కోట్లతో అభివృద్ధి

జిల్లా కేంద్రంలోని పిల్లల పార్కులో రూ.2.09 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో డీఎంఎఫ్‌టీ నిధులు రూ.1.57 కోట్లు, రూర్బన్‌ నిధులు రూ.52 లక్షలు ఉన్నాయి. అప్పటి అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి చొరవతో అప్పటి పంచాయతీ కార్యదర్శి వంశీకృష్ణ పార్కు అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. ప్రజలు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా వెదురు బొంగులతో వెయిటింగ్‌ రూమ్‌, టాయిలెట్లు ఏర్పాటు చేశారు. పిల్లల కోసం చుట్టూ వాల్‌ పెయింటింగ్స్‌, సీతాకోక చిలుకలు, జింకలు, ఊయల, నిచ్చెన, ఫౌంటేన్‌తోపాటు క్రీడా పరికరాలు ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పెద్దల కోసం ఓపెన్‌ జిమ్‌, వాకింగ్‌ ట్రాక్‌, కెఫెటేరియా ఏర్పాటు చేశారు. పార్కులో ప్రవేశ రుసుం రూ.10 ఉంది. అయితే ఉదయం పూట వాకర్స్‌ కోసం ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.

ఆహ్లాదం.. ఆరోగ్యం1
1/2

ఆహ్లాదం.. ఆరోగ్యం

ఆహ్లాదం.. ఆరోగ్యం2
2/2

ఆహ్లాదం.. ఆరోగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement