
న్యాయవాదుల విధుల బహిష్కరణ
ఆసిఫాబాద్: జిల్లా కోర్టుకు చెందిన న్యాయవాది నరహరిపై రెబ్బెన మండలం నంబాల సమీపంలో కొంతమంది దుండగులు దాడికి పాల్పడిన ఘటనను నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఆసిఫాబాద్, సిర్పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాపర్తి రవీందర్, శ్రీనివాస్ మాట్లాడుతూ నరహరి కోర్టు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా దుండగులు దాడి చేశారని పేర్కొన్నారు. రెబ్బెన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్సై కేసు నమోదు చేయకుండా, నరహరిని స్టేషన్‌కు పిలిపించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరింపులకు గు రిచేశారని ఆరోపించారు. ఎస్సైను సస్పెండ్ చేయా లన్నారు. లాయర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావా లని డిమాండ్ చేశారు. న్యాయవాదుల గుమాస్తాల సంఘం సభ్యులు మద్దతు పలికారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు టి.సురేశ్, సతీశ్‌బాబు, ముక్త సురేశ్, రైస్ అహ్మద్, కిశోర్, నికోడె రవీందర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.