ఈసారి కష్టమే...
ఇబ్బంది పడొద్దు
దారుణంగా ఎల్‌నినో ప్రభావం
జిల్లాలో ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు నీటి వసతి లేక వానాకాలం పంటలు విలవిల
తాగునీటికే ఇబ్బందులు ఎదురవుతాయని భావన
తీవ్రమైన వర్షాభావం
ఈ వానాకాలం సీజన్‌లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదైంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో కనీస స్థాయిలో కూడా వర్షాలు కురవక మొత్తం సీజన్‌లో 26 శాతం లోటు నమోదైంది. అయితే, జూన్‌లో కురిసిన వర్షాలతో రైతులు 2,92,915 ఎకరాల్లో వరి, 2,16,229 ఎకరాల్లో పత్తితో పాటు ఇతర పంటలు కలిపి 5.53,329 ఎకరాల్లో సాగు చేశారు. ఆ తర్వాత పంటలకు నీరు అందక సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్‌కు మళ్లించారు. అలాగే, సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో కొంత మేర ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం ఉన్న వనరులతో పంటలను గట్టెక్కించాల్సిన పరిస్థితి నెలకొంది.
గత యాసంగి జోరుగా..
2025–26 యాసంగి సీజన్‌లో జిల్లాలో పంటల సాగు అంచనాలను మించి నమోదైంది. వ్యవసాయ శాఖ 4.16 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తే, 4,95,157 ఎకరాల్లో సాగయ్యాయి. గత వానాకాలంలో పుష్కలంగా వర్షాలు కురవడంతో జలాశయాలు నిండాయి. దీంతో రైతులు వరి 2,59,993 ఎకరాల్లో, మొక్కజొన్న 2,26,069 ఎకరాల్లో సాగు చేయగా దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చింది.
నీటి కొరతతో...
ఈ ఏడాది వానాకాలంలో సాగు చేసిన పంటల దిగుబడి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. దీంతో యాసంగిలో పంటలతో నష్టాన్ని పూడ్చుకోవాలని రైతులు భావిస్తే నీటి కొరతతో ఆ పరిస్థితి కానరావడం లేదు. వానాకాలంలో అటు సాగర్ నుంచి కృష్ణా జలాలు, ఇటు సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తాగునీటి అవసరాలకు విడుదల చేశారు. కొన్నిచోట్ల రైతుల నిరసనలు రావడంతో పంటల కోసం వినియోగించారు. ప్రస్తుతం ఎండల నేపథ్యాన వేసవిలో నీటి కొరత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. సాగర్ నుంచి అరకొరగా నీటిని విడుదల చేసినా అవి తాగు అవసరాలకై నా సరిపోతాయా.. లేదా.. అన్న సందిగ్ధత నెలకొంది. ఈక్రమాన పరిస్థితుల దృష్ట్యా పంటలు సాగు చేయొద్దని అటు సీఎం, ఇటు మంత్రులు కోరారు. దీంతో జిల్లాలో యాసంగి సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
2026–27 యాసంగిలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎల్‌నినో ప్రభావంతో కనీస స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో ఖరీఫ్ పంటలు ఎండిపోయే దశకు రాగా.. తుపాన్ కారణంగా సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలు ఊపిరి పోశాయి. ఆ తర్వాత వానల జాడలేక, ఉష్ణోగ్రత 36 – 38 డిగ్రీల మేర నమోదవుతోంది. ఫలితంగా జలాశయాల్లోని నీరే కాక భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితి ఉంది. ఇదిలాగే కొనసాగి.. ప్రభుత్వ సూచనలతో యాసంగిలో రైతులు వరి సాగుకు దూరమైతే ఆరుతడి పంటలపై దృష్టి సారించే అవకాశముంది.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర జల వనరుల సంక్షోభ పరిస్థితులు నెలకొన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి. వానాకాలం
సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటలను
కాపాడేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా
కృషి చేస్తోంది. నీటి లభ్యత, వర్షాభావ
పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులు
రెండో పంట వేసి ఇబ్బందులకు గురికావొద్దు.
– కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఎల్‌నినో ప్రభావం దారుణంగా ఉంటుంది.
కరెంటు లేక, నీళ్లు దొరకని పరిస్థితి
ఎదురవుతుంది. ఇప్పటికే జలాశయాలు డెడ్ స్టోరేజ్‌కి చేరాయి. బొగ్గు నిల్వలు తగ్గడంతో
డిసెంబర్ కల్లా కరెంట్ కొరత ఏర్పడుతుంది.
పంటలు పండక బియ్యం ధర కేజీ రూ.100
దాటుతుంది. ఇది ప్రకృతి వైపరీత్యం..
ప్రధాని నుంచి సీఎం వరకు ఏమీ చేయలేరు
– సత్తుపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
జిల్లాలో యాసంగి సాగుపై నీలినీడలు అలముకున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వానాకాలం సరైన వర్షాలు కురవక ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జలాశయాల్లో నీరు అడుగంటుతోంది. భూగర్భ జలాలు కూడా ఇంకిపోతున్నాయి. ఈ నేపథ్యాన యాసంగి సాగు చేపట్టవద్దని
మంత్రులు సూచించగా.. రైతుల్లో సందిగ్ధత నెలకొంది. –సాక్షి ప్రతినిధి, ఖమ్మం
భూగర్భజలాలు తగ్గుతుండడంతో రెండో పంటపై అనిశ్చితి


