శ్రీ గాయత్రీదేవిగా అమ్మవారి దర్శనం | - | Sakshi
Sakshi News home page

శ్రీ గాయత్రీదేవిగా అమ్మవారి దర్శనం

Oct 13 2026 12:23 AM | Updated on Oct 13 2026 12:23 AM

ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం రెండో రోజుకు చేరాయి. తెల్లవారు జామున శ్రీవారికి అర్చకులు పంచామృతంతో అభిషేకం జరిపించారు. ఆతర్వాత యాగశాలలో కొలువైన స్వామి, అమ్మవార్లకు ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు పూజలు చేయడమే కాక గణపతి హోమం, శ్రీ సోమేశ్వరస్వామి ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. అనంతరం శ్రీ అలివేలు మంగ అమ్మవారిని శ్రీ గాయత్రి దేవిగా అలంకరించగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, చైర్మన్‌ ఉప్పల విజయదేవశర్మ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

కరాటే కోచ్‌లు

దరఖాస్తు చేసుకోవాలి

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లాలోని 87 ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న మహిళా కోచ్‌ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీవైఎస్‌ఓ టీ.సునీల్‌రెడ్డి తెలిపారు. ఈనెల 16వ తేదీ సాయంత్రంలోగా ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలోని జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. బ్లాక్‌ బెల్ట్‌ కలిగిన మహిళా కోచ్‌లకు తొలి ప్రాధాన్యత ఉంటుందని, మహిళా కోచ్‌లు సరిడా లేకపోతే పురుషుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీవైఎస్‌ఓ తెలిపారు.

15న అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు

ఖమ్మం స్పోర్ట్స్‌: అథ్లెటిక్స్‌ జిల్లా జట్ల ఎంపికకు ఈనెల 15న పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మందుల వెంకటేశ్వర్లు తెలిపారు. అండర్‌ –14, 16 కేటగిరీల్లో బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని, వివరాలకు 75692 11736, 94417 47772 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఇక్కడ ఎంపిక చేసే జట్లు నేరుగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు.

రవాణా శాఖ కార్యాలయాలకు సెక్యూరిటీ గార్డులు

ఖమ్మంక్రైం: రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలకు సెక్యూరిటీ గార్డులను నియమించారు. జిల్లాకు ఎనిమిది మందిని కేటాయించగా సోమవారం వారు విధుల్లో చేరారు. ఖమ్మం ఆర్‌టీఏ కార్యాలయానికి నలుగురితో పాటు వైరా, సత్తుపల్లికి ఇద్దరు చొప్పున గార్డులను ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమించారు. వీరికి నెలకు రూ.16వేల చొప్పున వేతనం చెల్లిస్తారు. గతంలో ఖమ్మంలో ఇద్దరు, వైరా, సత్తుపల్లిలో ఒక్కో గార్డు ఉండగా, పోలీసు శాఖ నుంచి కేటాయించిన వీరికి రవాణా శాఖ ద్వారా వేతనాలు చెల్లించేవారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను రౖపైవెట్‌ సెక్యూరిటీ సంస్థకు అప్పగించారు.

శివాలయ పునర్నిర్మాణానికి రూ.9 లక్షల విరాళం

కామేపల్లి: కారేపల్లిలోని శ్రీ గురుహరిహర మహా క్షేత్రం(శివాలయం) పునర్నిర్మాణానికి ఖమ్మంకు చెందిన చిరునోముల నరసింహారావు – పద్మావతి కుమారుడు శ్రీనివాసరావు – శ్రీదేవి దంపతులు రూ.9 లక్షల విరాళం ప్రకటించారు. ఇందులో తొలి విడతగా సోమవారం రూ.2 లక్షల నగదును కమిటీ ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గొట్టుపర్తి శివాజీ, దమ్మలపాటి శివాజీ, అజ్మీరా హరినాయక్‌, అజ్మీరా రాందాస్‌నాయక్‌, యర్రా తిరుపతిరావు, రాజేంద్రప్రసాద్‌, బండి శ్రీనివాస్‌, మనోజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement