రఘునాథపాలెం: తండ్రి కష్టం, తల్లి ఆశీర్వాదానికి తోడు కుమారుడి పట్టుదల ఆ కుటుంబంలో ఆనందాన్ని నింపింది. రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకు చెందిన తుమ్మలపల్లి నర్సింహారావు – ఉమ దంపతులు చిన్న హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. వీరి కుమారుడు సంజయ్ డీఎస్పీగా శిక్షణ పూర్తిచేసుకుని హైదరాబాద్‌లో సోమవారం జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి హాజరైన నర్సింహారావు దంపతులు తమ కుమారుడితో ఆనందాన్ని పంచుకున్నారు. కుటుంబ పోషణ కోసం తండ్రి పడిన శ్రమ, తన భవిష్యత్‌పై తల్లి పెట్టుకున్న ఆశలను నిజం చేసిన సంజయ్‌ను బంధువులతో పాటు బూడిదంపాడు గ్రామస్తులు అభినందించారు.
డీఎస్పీగా శిక్షణ పూర్తి చేసుకున్న
బూడిదంపాడు వాసి సంజయ్


