అశ్వారావుపేట/అశ్వారావుపేటరూరల్: రాష్ట్ర స్థాయి అండర్–20 బాలికల కబడ్డీ పోటీల్లో నల్లగొండ జిల్లా జట్టు ప్రథమస్థానం సాధించింది. రంగారెడ్డి జిల్లా జట్టు రన్నరప్‌గా నిలిచింది. అశ్వారావుపేటలో మూడు రోజులుగా సాగుతున్న కబడ్డీ పోటీలు సోమవారం ముగి శా యి. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోటీలో రంగారెడ్డి జట్టుపై నల్లగొండ జట్టు విజయం సాధించింది. పోటీల అనంతరం విజేత జట్టు సభ్యులు, కోచ్ అన్వర్‌ఖాన్ అనందంతో నృత్యం చేశారు. విజేతలకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురి ట్రోఫీ అందజేశారు. ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జిల్లా క్రీడాధికారి పరంధామరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రెండోస్థానంలో నిలిచిన రంగారెడ్డి జట్టు


