తెలంగాణకు శాపంగా పోలవరం | - | Sakshi
Sakshi News home page

తెలంగాణకు శాపంగా పోలవరం

Oct 12 2026 3:01 AM | Updated on Oct 12 2026 3:01 AM

ఖమ్మం సహకారనగర్‌: పోలవరం నిర్మాణంతో ఉమ్మడి జిల్లాలోని ఏడు మండలాలు మునిగిపోతూ, లక్ష మంది ఆదివాసులు నిర్వాసితులయ్యారని ప్రముఖ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి పేర్కొన్నారు. తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం(టాస్క్‌) జిల్లా ఆవిర్భావ సభ ఆదివారం జెడ్పీ హాల్‌లో నిర్వహించగా ముఖ్యఅతిథిగా యాదగిరి మాట్లాడారు. నిజాం నవాబు రాముడికి గుడి కడితే.. ఇప్పుడు పోలవరంతో అదే గుడికి ముప్పు ఎదురవుతోందని చెప్పారు. పారిశ్రామికీకరణ పేరుతో ఏర్పాటవుతున్న ఫార్మసీ కంపెనీలతో అడవులు కనుమరుగై చెంచుల జాతి అంతరించిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యాన టాస్క్‌ సమాజాన్ని తట్టి లేపుతూ, నిజాలను నిర్భయంగా ప్రకటించాలని సూచించారు. కాగా, తంగేడు పూలతో జలాలు శుద్ధి అవుతాయని మన ఆడబిడ్డలు ఏళ్ల క్రితమే గుర్తించి.. తంగేడు పూల బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తున్నారని తెలిపారు. టాస్క్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాల్సిన ఎలక్షన్‌ కమిషన్‌ ఎవరి చేతులో కీలుబొమ్మలా మారొద్దని తెలిపారు. టాస్క్‌ రాష్ట్ర కోకన్వీనర్‌ ములక సురేష్‌ అధ్యక్షత వహించగా పులి రాజు, డాక్టర్‌ ఆంజనేయులు, షేక్‌ నజీమా, బుక్క సత్యనారాయణ, సంగమేశ్వరరావు, దశరథ రామ్‌, రఘు, విశ్వ, సుగుణరావు, కట్టుకోజ్వాల రమేష్‌, రేలా శ్రీనివాస్‌ పాగి వెంకన్న, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

‘టాస్క్‌’ ఆవిర్భావ సభలో పాశం యాదగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement