రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌గా జీ.వీ. | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌గా జీ.వీ.

Oct 6 2026 12:54 AM | Updated on Oct 6 2026 12:54 AM

● ప్రమాణ స్వీకారం చేసిన కొత్త కమిటీ ● చైర్మన్‌గా ఏడాదికొకరికి బాధ్యతలు

● ప్రమాణ స్వీకారం చేసిన కొత్త కమిటీ ● చైర్మన్‌గా ఏడాదికొకరికి బాధ్యతలు

ఖమ్మం సహకారనగర్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా మేనేజింగ్‌ కమిటీ ఎన్నిక పూర్తయింది. చైర్మన్‌గా డాక్టర్‌ గోంగూర వెంకటేశ్వర్లు(జీ.వీ.), వైస్‌ చైర్మన్‌గా కె.కిరణ్‌కుమార్‌, కోశాధికారిగా యార్లగడ్డ రాఘవరావుతో పాటు రాష్ట్ర ఈసీ మెంబర్‌గా కొల్లా రవీంద్ర ఎన్నికయ్యారు. సభ్యులుగా డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌కుమార్‌, డాక్టర్‌ బి.శ్రీనివాసరావు, ఏ.శ్రీనివాసరావు, హరకర శ్రీరామ్‌రావు, కమర్తపు గోపాల్‌రావు, మురారిశెట్టి సౌజన్య, జయంతిలాల్‌ పటేల్‌, కేసాని మారుతిబాబు, పిట్టల వెంకట నరసయ్య, రౌలా కిషోర్‌ రెడ్డి, కరవాడి వెంకట శ్రీనివాసరావు ఉన్నారు.

ఏకపక్షంగా ‘కేఎస్‌ఎఫ్‌’ ప్యానల్‌ విజయం

రెడ్‌క్రాస్‌ కమిటీలో 15స్థానాలు ఉండగా 39 మంది ఉండడంతో పోలింగ్‌ అనివార్యమైంది. దీంతో ఆదివారం ఖమ్మం టీటీడీసీలో పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 2,430మంది ఓటర్ల గాను 1,174 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో 105ఓట్లు రిజక్ట్‌ కాగా, మిగతా ఓట్లలో ఎక్కువగా నమోదైన వారిని విజేతలుగా ప్రకటించారు. పూర్వ అధ్యక్షుడు వెలిగేటి చంద్రమోహన్‌ ప్యానల్‌ ఓటమి పాలుకాగా, ఖమ్మం సర్వీస్‌ ఫ్రంట్‌(కేఎస్‌ఎఫ్‌) సభ్యులే 15మంది విజయం సాధించారు.

ప్రమాణ స్వీకారం

నూతనంగా ఎన్నికై న సభ్యులతో సోమవారం ఎన్నికల అధికారి సీపీఓ శ్రీనివాస్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆతర్వాత 15మందిలో నుంచి చైర్మన్‌గా డాక్టర్‌ గోంగూర వెంకటేశ్వర్లు, వైస్‌ చైర్మన్‌గా కె.కిరణ్‌కుమార్‌, కోశాధికారిగా యార్లగడ్డ రాఘవరావుతో పాటు రాష్ట్ర ఈసీ మెంబర్‌గా కొల్లా రవీంద్రను ఎన్నుకున్నారు.

మూడేళ్లకొక చైర్మన్‌!

మూడేళ్ల కాలానికి గాను రెడ్‌క్రాస్‌ కమిటీని ఎన్నుకున్నారు. మొదటి ఏడాది చైర్మన్‌గా జీ.వీ.ని ఎన్నుకోగా, రెండో ఏడాది డాక్టర్‌ బొల్లికొండ శ్రీనివాసరావు, మూడో సంవత్సరం చైర్మన్‌గా డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌కుమార్‌ బాధ్యతల్లో ఉంటారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్‌ జీ.వీ. మాట్లాడుతూ తమ ప్యానల్‌ను గెలిపించిన ఓటర్ల నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతలు నిర్వర్తిస్తామని తెలిపారు. తమది పదవుల కోసం ఆరాటం కాదని, రెడ్‌క్రాస్‌ను సేవల్లో ముందు నిలిపేలా బాధ్యతలను మాత్రం పంచుకున్నామని తెలిపారు. అనంతరం రెడ్‌క్రాస్‌ ఫౌండర్‌ మెంబర్‌ కూరపాటి వెంకటేశ్వర్లుతో పాటు నూతన కమిటీని పలువురు సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement