ప్రతీ ఫిర్యాదు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతీ ఫిర్యాదు పరిష్కరించాలి

Oct 6 2026 12:54 AM | Updated on Oct 6 2026 12:54 AM

గ్రీవెన్స్‌ డేలో అదనపు

కలెక్టర్‌ శ్రీజ

ఖమ్మం సహకారనగర్‌: ప్రజలు అందించే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ డేలో ఆమె ప్రజల నుంచి దరఖాస్తులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన పలు సూచనలు చేశారు. ఆతర్వాత స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర మంత్రి జి.వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్‌ శ్రీజ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్‌ మాజీ సర్పంచ్‌ బొబ్బిలి భరత్‌చంద్ర తనకు రూ.17 లక్షలకు పైగా పెండింగ్‌ ఉన్న బిల్లులు త్వరగా చెల్లించాలని కోరారు.

తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలోని గ్రామకంఠం ప్రభుత్వ భూములను రక్షించాలని మాస్‌లైన్‌ నాయకుడు తిమ్మిడి హన్మంతరావు ఆధ్వర్యాన వినతిపత్రం అందజేశారు. అలాగే, బచ్చోడు కేంద్రంగా నూతన మండలం ఏర్పాటు, ఎస్‌బీఐ ఏర్పాటుచేయాలని అదనపు కలెక్టర్‌తో పాటు ఎస్‌బీఐ రీజినల్‌ మేనేజర్‌ రామ్మూర్తికి వినతిపత్రాలు అందజేశారు.

హస్నాబాద్‌కు చెందిన మామిడాల అనసూర్య తన కోడలు నుంచి జీవనభృతి ఇప్పించాలని కోరారు.

నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ అంబేద్కర్‌ సేవా సంఘం ప్రతినిధులు కోరారు.

బీటెక్‌ పూర్తిచేసిన తనకు ఉపాధి అవకాశం కల్పించాలని బోడ యమున వినతిపత్రం అందజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement