అన్నదాతలకు అండగా
సలహాలు, సూచనలు
క్షేత్రస్థాయి విధుల్లో దూసుకెళ్తున్న
అతివలు
ఖమ్మం వ్యవసాయం: ఒకప్పుడు మహిళా ఉద్యోగులు ఎక్కువగా కార్యాలయ విధులకే పరిమితమయ్యేవారు. అన్ని శాఖల్లో మాదిరి వ్యవసాయ శాఖలోనే ఇదే పరిస్థితి ఉండేది. కానీ రానురాను క్షేత్రస్థాయిలోనూ తమ విధులు నిర్వర్తించగలమంటూ మహిళా ఉద్యోగులు వ్యవసాయ శాఖను ఎంచుకుంటున్నారు. ఇంటర్‌మీడియట్ తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీ, ఎమ్మెస్సీ చేశాక అతివలు ముందడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యాన ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ శాఖలో అధిక భాగం మహిళా ఉద్యోగులే ఉండగా.. క్షేత్రస్థాయిలో దూసుకెళ్తూ సాగు పనుల్లో అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు.
పొలం గట్లపై ప్రయాణం
ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ శాఖలో మహిళా ఉద్యోగుల హవా కొనసాగుతోంది. ప్రస్తుతం అమలవుతున్న రైతు భరోసా, పంటల సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఏఈఓలు, ఏఓల్లో ఎక్కువగా మహిళలే ఉండగా... పంటల్లో నాట్లు వేయడం, విత్తనాలు నాటడం మొదలు కలుపు నివారణ, నీటి యాజమాన్యం, ఎరువుల వాడకం, చీడపీడల నివారణ, పంట కోతల వరకు ప్రతీ అంశంలో రైతులకు ప్రత్యక్షంగా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ రైతులు నష్టపోకుండా అండగా నిలుస్తున్నారు. ఎండనక, వాననక పొలం గట్లపై తిరుగుతూ క్షేత్రస్థాయిలో అన్నదాతలతో మమేకమవుతున్న మహిళా ఉద్యోగులు దేశ ఆహార భద్రతకు కూడా వెన్నుముకగా నిలుస్తున్నారని చెప్పొచ్చు. ఖమ్మం జిల్లా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్(డీడీఏ)గా కూడా మహిళా అధికారి సరిత వ్యవహరిస్తుండడం విశేషం.
వ్యవసాయ శాఖలో
సగభాగం మహిళా ఉద్యోగులే..


