ఎంత ధర అయినా కొనుగోలు చేస్తాం..
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నేలకొండపల్లి: ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ తాగు, సాగునీటి కొరత రాకుండా చూస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. విద్యుత్ కొరత ఎదురుకాకుండా అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి యానిట్‌కు రూ.12 చొప్పున కొనేందుకై నా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నేలకొండపల్లి మండలం కట్టుకాచారంలో పాలేరు వాగుపై రూ.6.65 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను శనివారం మంత్రి ప్రారంభించారు. అలాగే, రూ.2.50 కోట్లతో వట్టకుంట వాగు వరకు నిర్మించే బీటీ రోడు నిర్మాణానికి కలెక్టర్ దివాకర టీ.ఎస్‌తో కలిసి శంకుస్థాపన చేశాక, 31 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకులకు భిన్నంగా తాము పేదల పక్షాన నిలుస్తూ పాలించడమే కాక అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నామని తెలిపారు. కట్టుకాచారం చెక్‌డ్యామ్‌తో నేలకొండపల్లి మండలంతో పాటు సూర్యాపేట జిల్లా కోదాడ మండలానికి సాగునీరు అందుతుందన్నారు. ఇక విద్యుత్ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయంగా సౌర తదితర విద్యుత్ ప్లాంట్లపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. పేద, మద్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ చెక్‌డ్యామ్ వల్ల 250 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి లభ్యత వస్తుందన్నారు. జల వనరుల శాఖ సీఈ వాసంతి, జల వనరుల శాఖ, పీఆర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు ఎం.వెంకటేశ్వర్లు, వెంకట్‌రెడ్డి, యుగంధర్‌రావు, హౌజింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్‌డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల ఉద్యోగులు శ్రీనివాసరెడ్డి, పొట్టయ్య, తాళ్లూరి నరేష్, షేక్ మదీనా, ఎం. రుత్విక్‌రెడ్డి, కె.కేతిరెడ్డి, ఎం.యర్రయ్య, పి.రాంప్రసాద్, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
కేన్సర్ రీసెర్చ్ సెంటర్
ఏర్పాటు అభినందనీయం
సత్తుపల్లి: మారుమూల ప్రాంత ప్రజలకు సేవలందించేందుకు జనమంగళం ట్రస్ట్ ఆధ్వర్యాన కేన్సర్ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. సత్తుపల్లి మండలం నారాయణపురంలో రూ.200 కోట్లతో జన మంగళం ట్రస్ట్ ఆధ్వర్యాన షిర్డీసాయి హాస్పిటల్‌లో ఏర్పాటుచేసిన కేన్సర్ అవగాహన, స్క్రీనింగ్ సెంటర్‌ను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేన్సర్ బాధితులు చికిత్స ఖర్చుకు భయపడి మృత్యువాత పడుతున్నారని.. అలాంటి వారికి అండగా నిలుస్తున్న జనమంగళం ట్రస్టు బాధ్యులు అభినందనీయులన్నారు. అనంతరం వ్యవస్థాపక సభ్యులు రఘునాథరెడ్డి, సతీష్‌రెడ్డిని సన్మానించగా.. పదిహేను రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ నారాయణపురంలో కేన్సర్ హాస్పిటల్ ఏర్పాటు ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యుడు సతీష్‌రెడ్డి మాట్లాడుతూ కేన్సర్ మహమ్మారిని తరిమేందుకు సూపర్ స్పెషాలిటీ సెంటర్‌గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ దివాకర్ టీ.ఎస్., సీపీ సునీల్‌దత్, ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, టీజీ ఐడీసీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ ఎండీ.రెహనా బేగం, సర్పంచ్, ఉప సర్పంచ్ తిరుపతిరెడ్డి, తుంబూరు కృష్ణారెడ్డి, తుంబూరు దయాకర్‌రెడ్డి, మందపాటి ముత్తారెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొంగులేటి సత్తుపల్లిలో రూ.1.30కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.


