నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం

Aug 3 2026 12:55 AM | Updated on Aug 3 2026 12:55 AM

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని పరామర్శించిన పువ్వాడ

ఖమ్మం వైరారోడ్‌: అలవికాని హమీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి తదితర హమీలను అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురానికి చెందిన వేణుకుమార్‌ను ఖమ్మంలోని ఆస్పత్రిలో ఆది వారం ఆయన పరామర్శించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, జెడ్పీ మాజీ చైర్మన్‌ లింగాల కమల్‌ రాజు తదితరులతో కలిసి వేణును పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. అనంతరం పువ్వాడ మాట్లాడుతూ నిరుద్యోగుల ఆశలను వమ్ము చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. నిరుద్యోగులు అధైర్యపడొద్దని, వారి సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాడుతుందని తెలిపారు. రెండేళ్ల అనంతరం కేసీఆర్‌ నాయకత్వాన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతను ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ మాజీ చైర్మన్‌ గుండాల కృష్ణ, నాయకులు ఉప్పల వెంకటరమణ, బచ్చు విజయ్‌కుమార్‌, పగడాల నాగరాజు, వాచేపల్లి లక్ష్మారెడ్డి, అజ్మీరా వీరూనాయక్‌, బత్తుల మురళి, షేక్‌ మక్బూల్‌, అయ్యప్పరెడ్డి, జ్యోతిరెడ్డి, సామినేని హరిప్రసాద్‌, బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement