మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం

Apr 19 2026 8:05 AM | Updated on Apr 19 2026 8:05 AM

కొణిజర్ల/తిరుమలాయపాలెం: మొక్కజొన్నల కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహించిన రైతులు కొణిజర్లలో శనివారం రాస్తారోకోకు దిగారు. కొణిజర్ల మండలంలో దాదాపు 25 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కానీ వారం, పది రోజులుగా సొసైటీ అఽధికారులు లారీలు పంపించడం లేదని, గన్నీ బ్యాగులు వచ్చినా నాయకులు, వారి బంధువులకే ఇస్తున్నారని ఆరోపిస్తూ రైతులు కొణిజర్ల సొసైటీ సమీపాన రాస్తారోకో చేశారు. లారీలు పంపించేవరకు ఆందోళన విరమించేది లేదంటూ స్పష్టం చేశారు. దీంతో సొసైటీ సీఈఓ వెంకటేశ్వర్లు, ఏఓ బాలాజీ చేరుకుని జిల్లావ్యాప్తంగా లారీల కొరత ఉందని, కాంట్రాక్టర్‌ పంపించగానే గోపవరం పంపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆ తర్వాత పంట ఆన్‌లైన్‌ చేసుకున్న రైతులకు కూపన్లు జారీ చేయడంతో పాటు ఒక్కో రైతుకు వంద గన్నీ బ్యాగుల చొప్పున పంపిణీ చేశారు.

కేంద్రం ఏర్పాటు చేయాలని..

తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాల నే డిమాండ్‌తో తెట్టెలపాడు, పిండిప్రోలు, కేశ్వాపు రం రైతులు ఆందోళనకు దిగారు. పిండిపోలులో రహదారిపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనా లు నిలిచిపోయాయి. ఇప్పటికే పంట చేతికి వచ్చి నెల దాటుతుండగా, ప్రభుత్వ కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారస్తులు తక్కువ ధరకే అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట తక్కువగా సాగైన ప్రాంతాల్లో కాకుండా ఎక్కువగా సాగు చేసిన చోట కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఏఓ సీతారాంరెడ్డి చేరుకుని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఆందోళన విర మించారు. అనంతరం తహసీల్దార్‌ లూథర్‌ విల్సన్‌ చేరుకుని కలెక్టర్‌తో మాట్లాడి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎస్‌ఐ జగదీశ్‌ నేతృత్వాన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రైతులు జక్కుల వీరన్న, బిల్లగిరి ధనుంజయ్‌, చిర్రా కృష్ణయ్య, నరేందర్‌, శరభయ్య, గుంటి పుల్లయ్య, దొడ్డ గురవయ్య పాల్గొన్నారు.

కొణిజర్ల, తిరుమలాయపాలెంలో

రైతుల రాస్తారోకో

Advertisement
 
Advertisement
Advertisement