కల్లూరు: కల్లూరు మండలంలోని నారాయణపురంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబీకులు సోమవారం 35 కుంటల భూమిని వితరణ చేశారు. పీఎస్‌ఆర్ ట్రస్ట్ ద్వారా సోమవారం భూమి పత్రాలను ప్రభుత్వ వైద్యాధికారి నవ్యకాంత్, విద్యుత్ ఏడీఈ సగ్గుర్తి రామారావుకు అందజేశారు. ఆరోగ్య కేంద్రానికి సర్వే నంబర్ 137లోని 20కుంటలు, సబ్‌స్టేషన్‌కు 15 కుంటలు కేటాయించారు. పంచాయతీ పాలకవర్గం తీర్మానం మేరకు భూమి పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్లమందల వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ దేవర వాసుదేవరావుతో పాటు అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, భీమిరెడ్డి సత్యనారాయణరెడ్డి, పి.అంజిరెడ్డి, కె.కృష్ణారెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
వితరణ చేసిన
మంత్రి పొంగులేటి కుటుంబం


