ఖమ్మం సహకారనగర్: రెండు వారాల క్రితం ప్రజావాణిలో అందిన దరఖాస్తుపై స్పందించి మానవీయ కోణంలో చర్యలు చేపట్టామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. తల్లాడ మండలం గోపాలపేటకు చెందిన రాయల రమేశ్ – సులోచన దంపతులు 20 ఏళ్ల క్రితం ఖమ్మంకు వలస వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వీరి చిన్న కుమారుడు అజయ్(18)కు మెదడు ఎదుగుదల లోపించి మంచానికే పరిమితమయ్యాడు. సొంత ఇల్లు లేక, పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు రమేష్ దంపతులు కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో విన్నవించారు. దీంతో స్పందించిన అధికారులు క్షేత్ర స్థాయి విచారణ అనంతరం ఆ కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కేటాయించారు. ఈమేరకు సోమవారం అల్లీపురంలోని డబుల్ బెడ్‌రూం సముదాయం ఐదో బ్లాక్‌లో జీ7 ఇంటిని కేటాయిస్తూ పత్రాలను ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు వారికి అందజేశారు. ఈమేరకు తమ సమస్యపై స్పందించి ఇల్లు కేటాయించిన అధికారులకు రమేష్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కేటాయింపు


