ఘనంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

Mar 24 2026 8:05 AM | Updated on Mar 24 2026 8:05 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం 16వ డివిజన్‌ సీతారాంపురం(అగ్రహారం)లోని ఆలయాల సముదాయంలో దేవతామూర్తుల విగ్రహాలు, బొడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగా వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ వీరాంజనేయ, శ్రీ దాసాంజనేయ, శ్రీ ముత్యాలమ్మ, శ్రీ మైసమ్మ అమ్మవార్ల దేవాలయాలు, గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠా పూజలు ఈనెల 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అర్చకుడు బొర్రా వాసుదేవాచార్యులు బృందం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న పూజల్లో భాగంగా సోమవారం జలబిందెల ఊరేగింపు, విగ్రహాల గ్రామోత్సవం జరిగింది. అలాగే, బుధవారం ఉదయం విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు మేడారపు వెంకటేశ్వర్లు, నిరీశతో పాటు తుమ్మ అప్పిరెడ్డి, ఆళ్ల అంజిరెడ్డి, ఆకుల నర్సింహారావు, బొమ్మిశెట్టి రమేష్‌, చెరుకూరి కోటేశ్వరరావు, నర్ల శ్రీను, మల్లేశ్వరి, రమాదేవి, సుజాత, ఆదూరి రాజవర్దన్‌రెడ్డి, నల్లగట్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement