దళిత సాహిత్యానికి చుక్కాని
● జాతీయ సదస్సులో వక్తలు
ఖమ్మం సహకారనగర్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని దళిత సాహిత్యానికి ఎండ్లూరి సుధాకర్ రచనలు చుక్కానిలా నిలుస్తాయని వక్తలు పేర్కొన్నారు. ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ‘ఆచార్య ఎండ్లూరి సుధాకర్ సాహిత్యం – సమాలోచన’ అంశంపై రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ సదస్సు గురువారం ముగిసింది. ఈమేరకు 15 సెషన్లలో 200 మంది పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల వీసీలు కె.ప్రతాపరెడ్డి, ఎం.కుమార్ తదితరులు పాల్గొన్న ముగింపు సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు, రచయితలు, విద్యావేత్తలు హాజరయ్యారు. ఈమేరకు ముఖ్యఅతిథులుగా గుంటూరు లక్ష్మీనరసయ్య, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ సుధాకర్ సాహిత్యం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమేనని తెలిపారు. ఆయన సాహిత్యం ద్వారా ఎందరో పరిశోధనలు తయారయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బానోత్ రెడ్డి. ప్రొఫెసర్ కాసిం, మువ్వా శ్రీనివాసరావు, అప్సర్, పొనుగోటి కృపాకర్ మాదిగ, అధ్యాపకులు పాల్గొన్నారు.


