ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ: రైతు మృతి
సత్తుపల్లిరూరల్: ట్రాక్టర్‌ను లారీ వెనుక నుంచి ఢీకొట్టగా ఓ రైతు మృతిచెందిన ఘటన శనివారం అర్ధరాత్రి సత్తుపల్లి మండలం తాళ్లమడ శివారు జ్యూస్ ఫ్యాక్టరీ సమీపంలో చోటుచేసుకుంది. నారాయణపు రం గ్రా మానికి చెందిన రైతు తుంబూరు ఉమామహేశ్వరరెడ్డి (52) పామాయిల్ గెలల లోడును అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో దించి, తిరిగి వస్తుండగా తాళ్లమడ సమీపంలో డీజిల్ అయిపోయింది. ఓ వ్యక్తికి ఫోన్ చేసి డీజిల్ తెప్పించి ట్రాక్టర్‌లో నింపుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీట్రాక్టర్ ట్రక్కును ఢీ కొట్టింది. ఉమామహేశ్వరరెడ్డి ట్రాక్టర్ చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడగా స్థానికులు సత్తుపల్లి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
చుక్కల దుప్పికి
తీవ్ర గాయాలు
సత్తుపల్లిటౌన్: స్థానిక అర్బన్ పార్కు నుంచి రోడ్డుపైకి వచ్చిన చుక్కల దుప్పి తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పట్టణంలోని నీలాద్రి అర్బన్ పార్కు నుంచి గోడదూకి చుక్కల దుప్పి టీటీడీ కల్యాణ మండపం సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అటవీశాఖ అధికారులు చుక్కల దుప్పిని వెటర్నరీ వైద్యశాలకు తరలించి చికిత్స అందించి అర్బన్‌పార్కులో వదిలారు. కార్యక్రమంలో అటవీశాఖ బీట్ ఆఫీసర్ చెన్నకేశవరెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ: రైతు మృతి


