మూలన వాహనం..
దెబ్బతిన్న రూ.1.50 కోట్ల విలువ గల ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనం
చెత్త వాహనాల మధ్య కల్తీ
పరీక్షా కేంద్రం
విలువ
ఘనం..
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజారోగ్యం, కల్తీ ఆహారంపై పోరుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ పేరుతో రూ.1.50 కోట్లతో సమకూర్చిన మైక్రో బయాలజీ ల్యాబ్ యూనిట్ మొబైల్ వాహనం అధికారుల నిర్లక్ష్యంతో మూలన పడింది. అక్కడికక్కడే ఆహార పదార్థాల్లో కల్తీని పసిగట్టేందుకు అత్యాధునిక టెస్టింగ్ ల్యాబ్, వ్యా పారులకు లైసెన్స్, రిజిస్ట్రేషన్లు జారీ చేసే పరికరాలు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రొజెక్టర్లు, పిక్చర్ వాల్స్ వంటివి ఈ వాహనంలో ఉన్నా యి. జనరేటర్, నమూనాలు చెడిపోకుండా ఏసీలు సైతం అమర్చారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి వంటి ఐదు జిల్లాల్లో ఈ మొబైల్ ల్యాబ్‌ను వినియోగించాల్సి ఉంది. అయితే ఈ కీలకమైన వాహనం జిల్లాలు దాటడం అటుంచితే, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ) చెత్త వాహనాలు నిలిపే ప్రాంతం నుంచి అడుగు బయటపెట్టకుండా నిరుపయోగంగా పడి ఉంది. రూ.కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి ప్రభుత్వం పంపిన ఈ విలువైన ఆస్తిని అధికారులు చెత్త వాహనాల మధ్య పార్క్ చేసి తమ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన కీలకమైన సాధనం పని చేయకుండా ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కల్తీ ఆహారంపై నిరంతరం ఫిర్యాదులు వస్తున్న తరుణంలో, ఈ మొబైల్ ల్యాబ్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడం ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి, వాహనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ వాహనం చెత్త ట్రాక్టర్ల మధ్య కదలకుండా ఉండగా.. టెక్నీషియన్, డ్రైవర్ మాత్రం పని చేయకుండానే తమ వేతనాన్ని నెలనెలా తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


