ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–17 కరాటే పోటీలు నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలోని జిమ్నాజియం హాల్‌లో ఉత్సాహంగా జరిగాయి. పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 60మంది బాలురు, 35మంది బాలికలు పాల్గొన్నారు. పోటీలను నాకౌట్ పద్ధతిలో నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో జిల్లా పాఠశాలల క్రీడల సంఘం కార్యదర్శి వై.రామరావు, టోర్నీ నిర్వాహ కులు గోపతి సైదులు, జి.రాము, మహబూబ్‌పాషా, గఫూర్, బాబు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్లు..
అండర్–17 బాలుర జట్టుకు ఎ.నాగరాజ్ అక్షిత్, ఎస్డీ డిల్షాద్, పి.షణ్ముక్, టి.ఉజ్వల్, ఎల్.దీపక్, ఎస్కే ఇర్ఫాన్, బి.అశ్రిత్‌శేష్, ఎం.శివచైతన్య, బి.రిషిరాంనాయక్, వై.భానుప్రకాష్ ఎంపిక కాగా జిల్లా బాలికల జట్టుకు ఆర్.సహాసి, డి.వెన్నెల, ఎండీ ముక్సాన, ఎల్.యామిని, బి.మేరీలీన్, జి.అక్షిత, జి.జాస్విత, వి.తన్మయియ్, కె.హర్షిక, కె.ఎక్తశ్రీ ఎంపికయ్యారు.
9న టీయూసీఐ
రాజకీయ శిక్షణ తరగతులు
ఖమ్మంమయూరిసెంటర్: ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఈనెల 9న నేలకొండపల్లిలో నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వెంకన్న, జి.రామయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి ని చైతన్యం చేయడం కోసం, హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దాడులను తిప్పికొట్టడం వంటి అంశాలతో ఈ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కబడ్డీ మ్యాచ్‌లకు
వర్షం అడ్డంకి..
తనికెళ్లలో నేడు నిర్వహణ
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా పాఠశాలల క్రీడల సంఘం నేతృత్వంలో ఆదివారం నగరంలోని సర్దా ర్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న జిల్లాస్థాయి బాలుర కబడ్డీ పోటీలకు వర్షం అడ్డంకిగా మారింది. ఉదయం నుంచి నాకౌట్ మ్యా చ్‌లు సజావుగా కొనసాగినిప్పటికీ సాయంత్రం ఫైనల్స్, మూడోస్థానం, నాలుగో స్థానం కోసం నిర్వహించాల్సిన మ్యాచ్‌లను వర్షం పడటంతో నిలిపివేశారు. అయితే ఈ మ్యాచ్‌లను సోమవారం తనికెళ్లలో జరిగే బాలికల కబడ్డీ పోటీల సందర్భంగా నిర్వహిస్తామని క్రీడల సంఘం కార్యదర్శి వై.రామారావు తెలిపారు. బాలుర ఫైనల్స్‌లోకి ఖమ్మం సౌత్, కొణిజర్ల జట్లు ప్రవేశించాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి లాలయ్య, మండల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా అండర్–17 కరాటే టోర్నీ


