ఆరేళ్ల తర్వాత కుటుంబం చెంతకు...
ఖమ్మంఅర్బన్: మతిస్థిమితం కోల్పోయి ఆరేళ్ల క్రితం ఖమ్మంలో తిరుగుతూ కనిపించిన గుర్తుతెలియని వృద్ధుడిని చేరదీసి కోలుకున్నాక మహారాష్ట్రలో కుటుంబానికి అప్పగించిన అన్నం ఫౌండేషన్ బాధ్యులు మానవత్వాన్ని చాటారు. ఆరేళ్ల క్రితం 60ఏళ్ల వయసు గల మతిస్థిమితం లేని వ్యక్తి ఖమ్మంలో తిరుగుతుండగా పోలీసులు అన్నం ఫౌండేషన్ ఆశ్రమంలో చేర్పించా రు. అప్పటినుంచి వైద్యం చేయించగా ఇటీవల కోలు కున్నాడు. తన పేరు రాజేంద్ర అని, తమది మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా కటోలు గ్రామమని చెప్పాడు. అంతేకాక భార్య, కుమారుల పేర్లు చెప్పడంతో కటోలు పోలీసుల ద్వారా ఆరాతీసి కుటుంబాన్ని కనుగొ న్నారు. అయితే, పేదరికం కారణంగా కుటుంబీకులు ఖమ్మం వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఫౌండేషన్ చైర్మ న్ శ్రీనివాసరావు స్వగ్రామానికి తీసుకెళ్లి రాజేంద్రను పోలీసుల సమక్షాన ఆయన భార్య వందన, కుమారు డు మహేష్‌కు శనివారం అప్పగించారు. ఆరేళ్ల తర్వాత తర్వాత రాజేంద్రను చూసిన కుటుంబీకులు అన్నం ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత బ్యాండ్ చప్పుళ్ల నడుమ ఆయనను ఇంటికి తీసుకెళ్లారు.
మహారాష్ట్రలో అప్పగించిన ‘అన్నం’


