ఉపాధ్యాయుల చొరవతో అల్పాహారం
ఏన్కూరు: మండలంలోని బురద రాఘవాపురం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు శనివా రం నుంచి అల్పాహారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ ఏఎంఓ పెసర ప్రభాకర్‌రెడ్డి, సీఎంఓ బి.ప్రవీణ్‌కుమార్, హెచ్‌ఎం పి.నాగిరెడ్డి ప్రారంభించారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షలు పూర్త య్యే వరకు విద్యార్థులకు అల్పాహారం అందిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థుల ఆకలి తీర్చేలా అల్పాహారం సమకూర్చేందుకు ఉపాధ్యాయులు ముందుకొచ్చారని హెచ్‌ఎం తెలిపారు. పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


