జోనల్‌ వ్యవస్థకు మంగళం | - | Sakshi
Sakshi News home page

జోనల్‌ వ్యవస్థకు మంగళం

Nov 2 2025 9:28 AM | Updated on Nov 2 2025 9:28 AM

జోనల్‌ వ్యవస్థకు మంగళం

జోనల్‌ వ్యవస్థకు మంగళం

● ఈసారి కొత్తగా మండల స్థాయి పోటీలు.. ● నిధుల లేమితో కొన్నిచోట్లే నిర్వహణ ● ఎస్‌జీఫ్‌ బాధ్యుల తీరుపై విమర్శలు

తీర్మానం మేరకే టోర్నీలు కేటాయించా..

● ఈసారి కొత్తగా మండల స్థాయి పోటీలు.. ● నిధుల లేమితో కొన్నిచోట్లే నిర్వహణ ● ఎస్‌జీఫ్‌ బాధ్యుల తీరుపై విమర్శలు

ఖమ్మం స్పోర్ట్స్‌: ఏటా జిల్లాలో నిర్వహించే పాఠశాలల క్రీడా పోటీల్లో లోపాలు క్రీడాకారులకు శాపంగా మారుతున్నాయి. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నిర్వాహకుల నడుమ సమన్వయ లోపం కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతోంది. అంతేకాక గత ఆనవాయితీకి భిన్నంగా ఈ ఏడాది జోనల్‌ స్థాయి పోటీలకు స్వస్తి పలికి మండల స్థాయి క్రీడలకు శ్రీకారం చుట్టారు. ఈ పోటీల నిర్వహణకు 22 మండలాలకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అదే జోనల్‌ స్థాయిలోనైతే ఖర్చు తగ్గుతుందని ఈ విధానాన్ని అత్యధిక శాతం పీఈటీలు, ఫిజికల్‌ డైరెక్టర్ల ఆమోదంతో నిర్వహిస్తున్నారు. కానీ ఈసారి వీటికి బదులు మండల స్థాయిలో జరపాలనే నిర్ణయాన్ని పలువురు విబేధించినా జిల్లా స్కూల్‌ గేమ్స్‌ నిర్వాహకులు బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. దీంతో తప్పని పరిస్థితుల్లో జిల్లాలోని సగం మండలాల్లో పోటీలు నిర్వహించినా, మిగతా మండలాల బాధ్యులు విముఖత వ్యక్తం చేయడంతో పోటీలే జరగలేదు. ఫలితంగా ఔత్సాహిక క్రీడాకారుల్లో నిరాశ వ్యక్తమతోంది.

కొన్ని అంశాల్లో ముగిసిన రాష్ట్ర పోటీలు

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఇప్పటికే రాష్ట్రస్థాయి అండర్‌–14, 17 విభాగాల్లో సగం మేర అంశాల్లో పోటీలు పూర్తి చేసింది. కానీ జిల్లాలో మండల స్థాయి క్రీడా పోటీలు జరగకపోవడం గమనార్హం. కొన్ని క్రీడాంశాల్లో జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేసి రాష్ట్ర పోటీలకు సిద్ధంగా చేయగా.. ఇప్పుడు మండల స్థాయి పోటీలపైనే తర్జనభర్జన జరుగుతుండడంపై విమర్శలు వస్తున్నాయి.

జిల్లా కమిటీ ఉన్నట్టా.. లేనట్లా?

క్రీడా పోటీల నిర్వహణకు జిల్లా క్రీడా కార్యదర్శి ఆధ్వర్యాన ఒక కమిటీని నియమించారు. ఇందులో ఇద్దరు జాయింట్‌ సెక్రటరీలతో పాటే కొందరు సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఏటా పోటీలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈసారి కూడా అలాగే చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయిస్తే.. పోటీల నిర్వహణపై ముందస్తు సమాచారం లేకుండా జిల్లా కార్యదర్శే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఓ పక్క జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించాలని సూచించి... మరోపక్క మండల స్థాయి పోటీల నిర్వహణ ఇంకొందరికి అప్పగించడం సరికాదనే చర్చ జరుగుతోంది. కమిటీల్లో తాము ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నుంచేఉత్తర్వులు అందినా.. జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ బాధ్యులు విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

జిల్లా, మండల స్థాయి టోర్నీలను తీర్మానం మేరకే కేటాయించాం. అయితే, కొన్ని కారణాలతో ఇతరులకు అప్పగించాల్సి వచ్చింది. ఈ విషయం అర్థం చేసుకోలేని వారే విమర్శలు చేస్తున్నారు. నిధులు ఇవ్వకున్న నా సొంత ఖర్చులతో పోటీలు నిర్వహణ, జట్ల ఎంపిక చేస్తున్నా. జిల్లా అధికారుల సహకారంతో జిల్లా, మండలస్థాయి పోటీలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. – వై.రామారావు,

జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement