సత్తుపల్లి ఏరియా జీఎంగా శ్రీనివాస్
సత్తుపల్లి: సింగరేణి సత్తుపల్లి ఏరియా జీఎంగా చింతల శ్రీనివాస్ శనివారం క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జేవీఆర్ ఓసీని సందర్శించిన ఆయన బొగ్గు ఉత్పత్తి, రక్షణ చర్యలపై సూచనలు చేశారు. అలాగే, అధికారులతో సమావేశమై రోజువారీ, నెల వారీ లక్ష్యాలను సాధనకు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. తొలుత జేవీఆర్ కిష్టారం ఓసీల పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు, ఉద్యోగులు రాజేశ్వరరావు, శ్రీనివాసరావు, కల్యాణ్‌రాం, సోమశేఖర్, రామకృష్ణ, దేవదాసు, యూనియన్ల నాయకులు ఎండీ.రజాక్, సముద్రాల సుధాకర్, తీగల క్రాంతి, నర్సింహా రావు తదితరులు జీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.
4న అండర్–17
హ్యాండ్‌బాల్ ఎంపికలు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన ఈనెల 4వ తేదీన ఉమ్మడి జిల్లాస్థాయి బాలబాలికల హ్యాండ్‌బాల్ జట్లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రీడల సంఘం కార్యదర్శి వై.రామారావు తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఉదయం 10గంటలకు మొదలయ్యే ఎంపిక పోటీలకు క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికేట్, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 94417 47772, 99857 71159 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
ఎస్‌బీఐటీ అధ్యాపకుడికి డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్ బీఐటీ కళాశాల సీఎస్ ఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ గంటెల ప్రభాకర్‌కు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. ‘ఎన్‌హాన్స్‌డ్ మెథడాలజీస్ ఫర్ డేటా సెక్యూరిటీ ఇన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ యూజింగ్ డీప్ లెర్నింగ్ మోడ ల్స్’ అంశంపై డాక్టర్ బొబ్బా బసవేశ్వరరావు పర్యవేక్షణలో ఆయనసమర్పించిన పరిశోధనా పత్రానికి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ను కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ, సెక్రటరీ, కరస్పాండెంట్ ధాత్రి, అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్‌కుమార్, శ్రీని వాసరావు, శివప్రసాద్, రవీంద్రబాబు, ప్రిన్సి పాల్ రాజ్‌కుమార్ అభినందించారు.
అండర్–17 వెయిట్ లిఫ్టింగ్ జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–17 బాలబాలికల వెయిట్ లిఫ్టింగ్ జట్లను శనివారం ఎంపిక చేశారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీలకు 60 మంది బాలురు, 25మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబర్చిన వారి నుంచి జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా పాఠశాలల క్రీడా సంఘం కార్యదర్శి వై.రామారావు తెలిపా రు. బాలుర జట్టుకు ఎం.శ్యామ్, బి.రిషి, జి. శేషు, కె.ధనుష్, పి.దివాకర్, సీహెచ్. శరత్‌చంద్ర, ఎం.భరత్, ఎం.యశ్వంత్, బాలికల జట్టుకు జి.కావ్య, టి.పవిత్ర, ఏ.టోనీశ్రీ, జి.శృతి, సీహెచ్. శ్రీవల్లి, డి.శాంతి, ఎన్.హాసిని ఎంపికయ్యారని వెల్లడించారు.
రాళ్లవాగు వరదలో మునిగిన కారు వెలికితీత
తిరుమలాయపాలెం: మండలంలోని కేశ్వాపురం– తిప్పారెడ్డిగూడెం మధ్య రాళ్లవాగు ఉధృతిలో గత నెల 29న రాత్రి గల్లంతైన కారు బయటపడింది. ఈ కారు వరదలో మునుగుతుండగా అందులో ప్రయాణిస్తున్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన కొప్పుల రమేష్ కుటుంబీకులు ఐదుగురు సురక్షితంగా బయటపడిన విషయం విదితమే. ఈ మేరకు గాలిస్తుండగా వాగు కాల్వ సమీపాన బావిలో కారు తేలడంతో జేసీబీ ద్వారా బయటకు తీయించినట్లు ఎస్‌ఐ కె.జగదీష్ తెలిపారు.
సత్తుపల్లి ఏరియా జీఎంగా శ్రీనివాస్
సత్తుపల్లి ఏరియా జీఎంగా శ్రీనివాస్
సత్తుపల్లి ఏరియా జీఎంగా శ్రీనివాస్


