రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
మధిర: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిన వ్యక్తి మృతి చెందాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరుకు చెందిన పొట్నూరి అరుణ్‌కుమార్ హైదరాబాద్‌లో పెయింటింగ్ వర్క్ చేస్తుంటాడు. ఆయన శుక్రవారం రాత్రి రైలులో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మధిర – తొండల గోపవరం రైల్వేస్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు జారిపడడంతో తీవ్రగాయాల పాలై మృతి చెందాడు. అరుణ్‌కు భార్య, ఇద్దరు పిల్ల లు ఉండగా సమాచారం ఇచ్చి కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ..
సత్తుపల్లి(పెనుబల్లి): మండలంలోని లంకపల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడుకు చెందిన గుర్రం వెంకటదాసు – సంపూర్ణ(45) దంపతులు శనివారం ఉదయం స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంపై వీ.ఎం.బంజరు మీదుగా ఏపీలోని జీలుగుమిల్లి వెళ్తున్నారు. మార్గమధ్యలో లంకపల్లి వద్ద వీరి వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ టైర్ కిందపడిన సంపూర్ణ అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటదాసుకు గాయాలయ్యాయి. సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తిలింగం, ఎస్సై వెంకటేష్ ఘటనాస్థలిని పరిశీలించి మృతురాలి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
వాగులో గల్లంతైన వ్యక్తి..
తల్లాడ: మండలంలోని కుర్నవల్లి రాళ్ల వాగు ప్రవా హంలో గల్లంతైన వ్యక్తి మృతి చెందగా మూడు రోజులకు మృతదేహం బయటపడింది. కుర్నవల్లి తూర్పు హరిజనవాడకు చెందిన తాటిపర్తి యేసు(50) గురువారం తన భార్యతో పాటు అత్తగారింటికి బయలుదేరారు. మధ్యలో రాళ్లవాగు సమీపాన పొలంలోని మోటార్ బంద్ చేసి వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. ఆ సమయాన భారీ వర్షంతో రాళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా యేసు తిరిగి రాలేదు. దీంతో ఆయన భార్య తర్వాత వస్తాడని లేదా ఇంటికి వెళ్తాడని భావించి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరూ కలిసే వెళ్లారని కుటుంబీకులు భావించారు. కానీ యేసు వరద ఉధృతికి కొట్టుకుపోగా ఆయన మృతదేహం శనివారం బయటపడింది. సమీప రైతులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా కన్నీరుమున్నీరయ్యారు. కాగా, వాగు వద్దకు చేరేసరికి చీకటి పడడంతో మృతదేహాన్ని ఆదివారం బయటకు తీయించనున్నట్లు పోలీసులు తెలిపారు.
అనారోగ్య కారణాలతో
ఆత్మహత్య
ఖమ్మంఅర్బన్: ఖమ్మం ధంసలాపురం కొత్తకాలనీకి చెందిన లింగం భరత్‌కుమార్(34) ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయన భార్యస్వప్న శనివారం ఇంట్లో లేని సమయాన ఉరివేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు.
బాలికపై ఇద్దరు బాలురు, యువకుడి లైంగిక దాడి
కొణిజర్ల: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఇద్దరు బాలురు, ఓ యువకుడు లైంగిక దాడికి పాల్ప డ్డారు. మండలంలోని శాంతినగర్ సమీపాన ఓ కాలనీకి చెందిన బాలిక శుక్రవారం రాత్రి ఒంటిరిగా ఉంది. ఆ సమయాన ఇద్దరు మైనర్లు, ఓ యువకుడు వెళ్లి ఆమైపె లైంగిక దాడిచేశారు. ఆతర్వాతఇంటికి వచ్చిన తల్లికి బాధితురాలు విషయం చెప్పడంతో శనివారం ఉదయం ఫిర్యాదు చేయగా నిందతులపై కేసు నమోదు చేసి బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై జి.సూరజ్ తెలిపారు.
రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి


