‘పుట్లూరి’ సేవలు అభినందనీయం
ఖమ్మం సహకారనగర్: విద్యార్థులను తీర్చిదిద్దడమే కాక ఉపాధ్యాయుల సమస్యల పరిస్కారానికి పాటుపడిన పుట్లూరి వెంకటేశ్వరరెడ్డి సేవలు అభినందనీయమని పీఆర్‌టీయు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టా శేఖర్‌రావు, ఆర్.రంగారావు అన్నారు. పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి ఇటీవల ఉద్యోగ విరమణ చేయగా ఖమ్మంలోని కార్యాయంలో చింతకాని మండల శాఖ ఆధ్వర్యాన వెంకటేశ్వరరెడ్డి – భ్రమరాంబ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో శేఖర్‌రావు, రంగారావు మాట్లాడుతూ గత 35ఏళ్లుగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పాటుపడ్డారని తెలిపారు. పీఆర్‌టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు, చింతకాని మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నెల్లూరి విజయ్‌భాస్కర్, ప్రభాకర్‌రెడ్డితో పాటు వెంకటనర్సయ్య, విజయ్, అమృత్, వేముల భిక్షం, రాయల నర్సింహరావు, రమేష్ పాల్గొన్నారు.


