సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నిరసన
ఖమ్మం మామిళ్లగూడెం: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శతృదేశానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆరోపించారు. ఈమేరకు శనివారం ఖమ్మంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశాక ఆయన మాట్లాడారు. భారత సైన్యం దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే సీఎం శతృదేశానికి అనుకూలంగా మాట్లాడడం సరి కాదన్నారు. ఈ వ్యాఖ్యలపై సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు డాక్టర్ నెల్లూరి బెనర్జీ, వీరెల్లి రాజేష్‌గుప్తా, నల్లగట్టు ప్రవీణ్, నగరికంటి వీరభద్రం, రవిరాథోడ్, మందడపు సుబ్బారావు, మంద సరస్వతి, రజినీరెడ్డి, పమ్మి అనిత, కొణతం లక్ష్మీనారాయణగుప్తా, రవి గౌడ్, బోయినపల్లి చంద్రశేఖర్, పీవీ.చంద్రశేఖర్, మాధవ్, మార్తి వీరభద్రప్రసాద్, కందుల శ్రీకృష్ణ, రవిగౌడ్ పాల్గొన్నారు.


