ప్రభుత్వం ఆదుకోవాలి...
వైరారూరల్: ఎకరాకు రూ.18 వేలు చొప్పున రూ.4.50 లక్షల కౌలు చెల్లించి 25 ఎకరాల్లో వరి సాగు చేశా. ఇతర ఖర్చులు కలిపి పెట్టుబడి రూ.7.75లక్షలు అయింది. ఎకరాకు 35–40 బస్తాల దిగుబడి వస్తుందని ఆశించాను. ఇప్పటికే హార్వెస్టర్ కూడా మాట్లాడగా తుపాన్‌తో పంట మొత్తం నేలకొరిగింది. చేనులో నీరు చేరడంతో కోత కూడా కష్టమే. అయినా ఎకరాకు 20 బస్తాల దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. తుపాన్ కారణంగా పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉన్నందున ప్రభుత్వం పరిహారం చెల్లించాలి.
– కామినేని రవి, గండగలపాడు, వైరా మండలం


