అప్రమత్తంగా యంత్రాంగం
ఖమ్మం సహకారనగర్: తుపాన్ నేపథ్యాన జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత రెండు రోజులుగా వర్షసూచనలు ఉండడంతో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇక మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అంతేకాక కలెక్టరేట్‌లో 1077, 90632 11298 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయించారు. ఆపై మున్నేటి పరీవాహకం, కొణిజర్ల మండలంలో కలెక్టర్ అధికారులతో కలిసి పర్యటించారు. అంతేకాక పదిహేను మందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని సిద్ధం చేశారు. కేఎంసీ, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రాంతాలు ముంపునకు గురికాగా పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి ఇన్‌చార్జ్‌లను నియమించినట్లు డీఆర్వో పద్మశ్రీ తెలిపారు. నాలుగు బోట్లు, ఒక ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం, ఆరు ఫైరింజన్లు, ఏడు డీవాటరింగ్ పంప్‌లను సిద్ధంచేసి, 105మంది మత్స్యకారులను నియమించినట్లు వెల్లడించారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రెడీ


