ముగిసిన ‘చాంబర్’ నామినేషన్ల పర్వం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ నామినేషన్ల ఘట్టం బుధవారంతో ముగిసింది. చివరిరోజు పలు పదవులకు 37 నామినేషన్లు దాఖలయ్యాయి. గడువు ముగిసే నాటికి మొత్తంగా ఆఫీస్ బేర్లర్లతో పాటు పలు శాఖల్లో 76 పదవులకు 118 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. చివరిరోజు మేళ్లచెర్వు – జీవై నరేశ్ ప్యానల్ బాధ్యులు మద్దతుదారులతో కలిసి ర్యాలీగా వర్తక సంఘానికి చేరు కుని నామినేషన్లు వేశారు. చాంబర్ అధ్యక్ష పదవికి మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పదవికి సోమ నరసింహారావు, ఉపాధ్యక్ష పదవికి బత్తిని నరసింహారావు, సహాయ కార్యదర్శి పదవికి ముత్యం ఉప్పల్‌రావు, కోశాధికారి పదవికి తల్లాడ రమేశ్, దిగుమతి, మిర్చి, వెండి, బంగారం శాఖ లకు కోలేటి నవీన్, ఆత్మకూరి రామారావు, మెంతుల శ్రీశైలం, యడ్లపల్లి సతీశ్, బందు సూర్యం, నకిరకంటి సతీశ్ తదితరులు నామినేషన్లు సమర్పించారు. ఈ ప్యానెల్‌కు మద్దతుగా కాళ్ల పాపారా వు, మలిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యా రు. అలాగే, అధ్యక్ష పదవికి కొదుమూరి మధుసూదన్‌రావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖా లు చేశారు. దీంతో అధ్యక్ష పదవికి నలుగురు, ప్రధాన కార్యదర్శి పదవికి ఇద్దరు, ఉపాధ్యక్ష పదవికి ఇద్దరు, సహాయ కార్యదర్శి పదవికి ఇద్దరు, కోశాధ్యక్ష పదవికి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేసినట్లయింది. గురువారం నామినేషన్లు పరిశీలించనుండగా, శుక్రవారం ఉపసంహరణ అనంతరం బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
మొత్తం 76 పదవులకు 118 నామినేషన్లు


