ఇద్దరిని కాపాడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం
కొణిజర్ల: పోలీసులు, స్థానికులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ద్విచక్ర వాహనంపై వరద దాటేందుకు యత్నిస్తున్న ఇద్దరు యువకులు పడిపోగా.. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు కాపాడారు. కొణిజర్ల మండలం తీగలబంజర సమీపాన పగిడేరు ఉధృతంగా ప్రవహిస్తుండగా బుధవారం మధ్యా హ్నం పోలీసులు ట్రాక్టర్ అడ్డు పెట్టి రాకపోకలు నిలిపేశారు. ఇంతలోనే ఇద్దరు యువకులు పోలీసులను ఖాతరు చేయకుండా వాగు దాటే క్రమాన వరద ఉధృతికి వాహనం జారి పడబోయింది. అక్కడే ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించి తాళ్ల సాయంతో ద్విచక్రవాహనం సహా యువకులను బయటకు లాగడంతో ఊపిరి పీల్చుకున్నారు.


